: కర్నూలు జిల్లా బంద్.. బస్సు డిపోల ఎదుట వైసీపీ కార్యకర్తల ఆందోళన
పత్తికొండ వైఎస్సార్సీపీ ఇన్ చార్జి నారాయణరెడ్డి హత్యకు గురైన నేపథ్యంలో ఈ రోజు కర్నూలు జిల్లా బంద్ కు ఆ పార్టీ పిలుపు నిచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని బస్ డిపోల ఎదుట వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బస్సులు బయటకు రాకుండా, పెట్రోల్ బంక్ లు, వ్యాపార, వాణిజ్య సంస్థలను తెరవనీయకుండా అడ్డుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ర్యాలీలు, ధర్నాలకు దిగాయి.