: ఐర్లాండ్‌లో ప్రధాని పదవికి పోటీపడుతున్న భారతీయుడు.. పదవి చేపడితే తొలి స్వలింగ సంపర్కుడిగా రికార్డు!


భారత సంతతికి చెందిన ఐర్లాండ్ మంత్రి లియో వరదాకర్ (38) ఆ దేశ ప్రధాని రేసులో ఉన్నారు. ఆయన కనుక ప్రధాని అయితే ఆ పదవిని చేపట్టిన మొట్టమొదటి స్వలింగ సంపర్కుడిగా నిలవనున్నారు. డుబ్లిన్‌లో జన్మించిన వరదాకర్ తండ్రి ముంబైకి చెందిన వారు కాగా, తల్లి ఐరిష్ మహిళ.  సంక్షేమ శాఖామంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన ప్రధాని పదవి రేసులో ఉన్నారు. తోటి మంత్రుల కంటే ఆయనకే ఎక్కువ మద్దతు ఉండడంతో ఆయన గెలుపు ఖాయమని చెబుతున్నారు. ప్రధాని పదవికి బలమైన అభ్యర్థిగా భావిస్తున్న ఎండాకెన్నీ రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. దీంతో వెంటనే వరదాకర్ తాను పోటీలో ఉన్నట్టు ప్రకటించారు.  అన్ని వైపుల నుంచి మద్దతు కూడగట్టుకోవడంలో ఆయన విజయం సాధించారు. దీంతో ఆయన గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News