: కాశ్మీర్ సమస్యకు మోదీ సర్కార్ శాశ్వత పరిష్కారం చూపిస్తుంది: రాజ్ నాథ్ సింగ్


కాశ్మీర్ సమస్యకు మోదీ సర్కార్ శాశ్వత పరిష్కారం చూపిస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. కాశ్మీర్ లో సమస్యను రాజేయడం ద్వారా భారత్ ను అస్థిర పరిచేందుకు పాక్ యత్నిస్తోందని, తన పద్ధతిలో మార్పు రాకపోతే, మనమే మార్చాల్సి వస్తుందని రాజ్ నాథ్ అన్నారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి పాకిస్తాన్ సహా ఆయా దేశాధినేతలను నాడు ఆహ్వానించిన విషయాన్ని రాజ్ నాథ్ గుర్తు చేశారు. ప్రపంచీకరణ అనంతరం ఒక దేశాన్ని మరో దేశం అస్థిరపరచడం సాధ్యం కాదని అన్నారు. కాగా, మూడు రోజుల పర్యటన నిమిత్తం రాజ్ నాథ్ సింగ్ నిన్న సిక్కింకు వెళ్లారు.

  • Loading...

More Telugu News