: తలాక్ రద్దులో రెండో అభిప్రాయం వద్దు.. అది అమానవీయం.. ప్రముఖ నటి షబానా ఆజ్మీ
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశమైన విషయం ట్రిపుల్ తలాక్. ఈ విషయంపై ప్రముఖ బాలీవుడ్ నటి షబానా ఆజ్మీ మాట్లాడుతూ తలాక్ రద్దు విషయంలో రెండో ఆలోచన, అభిప్రాయం ఉండకూదని అన్నారు. ఇది అత్యంత అమానవీయమని, ముస్లిం మహిళల హక్కులకు పూర్తి భంగకరమని పేర్కొన్నారు. ఖురాన్‌లో ఎక్కడా తలాక్ గురించి లేదని అన్నారు. ముస్లిం మహిళల సాధికారతను ట్రిపుల్ తలాక్ కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం మహిళల హక్కులను కాపాడడం ప్రభుత్వ బాధ్యతని, ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయాల్సిందేనని షబానా స్పష్టం చేశారు.