: నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 35 మందికి గాయాలు
నెల్లూరు జిల్లాలో ఈ రోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. తిరుపతి నుంచి కావలి వెళ్తున్న ఆర్టీసీ బస్సు నాయుడుపేట-అగ్రహారం రోడ్డుపై ఆగి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీ కొట్టడంతో 35 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అందులో, నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.