: కేసీఆర్ ఇంట్లో పని చేసే యువకుడి పెళ్లి ఘనంగా .. పెళ్లిపెద్దలుగా కేసీఆర్ దంపతులు!


సీఎం కేసీఆర్ ఇంట్లో పన్నెండు సంవత్సరాలుగా పని చేస్తున్న సతీష్ పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లిపెద్దలుగా కేసీఆర్ దంపతులు వ్యవహరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన కొండేరు సతీశ్ కు, హైదరాబాద్ కు చెందిన శిరీషతో పెళ్లి జరిగింది. సతీష్ పెళ్లిని కేసీఆర్ దగ్గరుండి అన్నీ తానై జరిపించారు. సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయమైన ప్రగతిభవన్ లో నిన్న ఈ వివాహం జరిగింది.

ఈ సందర్భంగా వధూవరులకు కానుకగా 12 తులాల బంగారంతో పాటు ఒక చక్కని ఫ్లాట్ ను కేసీఆర్ అందజేశారు. ఇక, పెళ్లి విందు, ఇతర ఏర్పాట్లను స్వయంగా కేసీఆర్ దంపతులు, కూతురు కవిత దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు, ఎమ్మెల్యేలు, తదితరులు హాజరయ్యారు. కాగా, ఆ ఇంట్లో పనిచేసే సతీష్, కేసీఆర్ కు భోజనం వడ్డించడం నుంచి సమయానికి మందులు ఇవ్వడం వరకు అన్నీ అతనే చూస్తుంటాడు.

  • Loading...

More Telugu News