: ‘ఇలానే మాట్లాడితే, నీకు జీవితాంతం పెళ్లి కాదు’... యాంకర్ రవికి నాగార్జున చురక
‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో రిలీజ్ వేడుకకు అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, నటుడు సంపత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా, ఆర్టిస్ట్ లకు వెల్ కమ్ చెబుతూ.. మేళాలు మోగిస్తూ వారిని లోపలికి స్వాగతం పలికారు. దీంతో నాగార్జున, నాగ చైతన్య, రకుల్ తదితరులు హుషారుగా స్టెప్పులేశారు. ఆ తర్వాత యాంకర్ రవికి, నాగార్జునకు మధ్య సరదా సంభాషణ జరిగింది. ‘ చైతన్య చెప్పినట్టు అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం సార్. మీరు ఏమంటారు?’ అని ప్రశ్నించగా.. ‘ఇలానే మాట్లాడితే, నీకు జీవితాంతం పెళ్లి కాదు’ అని నాగార్జున అనడంతో నవ్వులు విరిశాయి.