: నారాయణరెడ్డిది రాజకీయ హత్యే: ఎమ్మెల్యే రోజా
పత్తికొండ వైఎస్సార్సీపీ ఇన్ చార్జి నారాయణరెడ్డిది రాజకీయ హత్యేనని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఈ సంఘటనపై ఆమె మీడియాతో మాట్లాడుతూ, నంద్యాల ఉప ఎన్నికల కోసం, పార్టీ కోసం కీలకంగా పని చేస్తున్ననారాయణరెడ్డిని అధికార పార్టీ హత్య చేయించిందని ఆరోపించారు. రాజకీయంగా చంద్రబాబుకు భవిష్యత్తులో ముప్పు ఉంటుందని, బలమైన నాయకుడిగా ఎదుగుతున్న ఆయన ముందు నిలవలేమని చెప్పే ఈ హత్య చేయించారని రోజా ఆరోపించారు ఈ సంఘటనకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని, ఏపీ హోమ్ మంత్రి చినరాజప్ప ఓ రబ్బరు స్టాంపులా మారారని ఈ సందర్బంగా విమర్శించారు.