: ఆన్‌లైన్ పేకాటకు చెక్.. సెల్‌ఫోన్లో ఇంటిలో ఆడినా నేరమే.. తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం!


ఆన్‌లైన్ వేదికగా సాగుతున్న జూదానికి చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మురిపించి, మెరిపించి నట్టేట ముంచే ఈ ఆన్‌లైన్ జూదానికి చెక్ చెప్పాలని నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణ గేమింగ్ చట్టం-1974కు సవరణలు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో ‘సైబర్ స్పేస్’ అనే పదాన్ని జోడించడం ద్వారా ఆన్‌లైన్‌లో జోరుగా సాగుతున్న గుర్రపు పందేలు, పేకాట, క్రికెట్ బెట్టింగ్ వంటివాటిపై ఉక్కుపాదం మోపేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా కంప్యూటర్‌, సెల్‌ఫోన్‌లలో ఈ ఆటలు ఆడేవారిపై  కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తారు. ఇంట్లో రహస్యంగా ఆడుతున్నామని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే గేమింగ్ సైట్లలో తరచూ లాగిన్ అయ్యే వారిపై పోలీసులు నిఘా పెడతారు.

సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో వివరాలు సేకరించి క్రిమినల్, నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు పెడతారు. గేమింగ్ నిర్వాహకులపైనా చర్యలు తీసుకుంటారు. దాడుల్లో పట్టుబడే నగదు, ఆభరణాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుంటారు. నిందితులను అరెస్ట్ చేయడమే కాకుండా ఆట కోసం ఉపయోగించిన బ్యాంకు ఖాతాను స్తంభింపజేస్తారు. ఈ నేరం చేస్తూ తొలిసారి పట్టుబడితే ఏడాది జైలు, రూ.5 వేల జరిమానా, రెండోసారి పట్టుబడితే అందుకు రెట్టింపు శిక్ష, జరిమానా విధిస్తారు. చట్టం సవరణకు న్యాయపరమైన ప్రక్రియ ఇప్పటికే పూర్తి అవడంతో త్వరలోనే ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది.

  • Loading...

More Telugu News