: ఇటలీ కీ ఇడ్లీ బన్‌గయీ: సెహ్వాగ్ ఆసక్తికర ట్వీట్


భారత అండర్‌-17 ఫుట్‌బాల్‌ జట్టు క్రీడాకారులను దేశంలోని ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. నిన్న అరిజోలో ఇటలీ అండర్‌-17 ఫుట్‌బాల్‌ జట్టుపై భారత్ 2-0తో గెలిచింది. త్వ‌ర‌లో స్వదేశంలో జరిగే ఫిఫా అండర్‌-17 ప్రపంచకప్ నేప‌థ్యంలో ఇట‌లీతో గెలుపు మ‌న ఆట‌గాళ్ల‌తో మ‌రింత ఆత్మ‌విశ్వాసాన్ని నింపుతుంద‌ని పలువురు అంటున్నారు. కేంద్ర క్రీడశాఖ‌ మంత్రి విజయ్‌ గోయెల్‌, క్రికెట‌ర్‌ మహ్మద్‌ కైఫ్‌, న‌టుడు అభిషేక్‌ బచ్చన్ వంటి ఎంద‌రో ప్ర‌ముఖులు అండర్‌-17 జట్టు విజ‌యాన్ని కొనియాడారు. ఈ క్రమంలో, టీమిండియా మాజీ ఆట‌గాడు ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ఓ ట్వీట్ అభిమానుల‌ను అల‌రిస్తోంది. ‘ఇటలీ కీ ఇడ్లీ బన్‌గయీ’ అంటూ ఆయ‌న త‌నదైన శైలితో మ‌న దేశ టీమ్ విజ‌యాన్ని కొనియాడాడు. ఇట‌లీ టీమ్‌ని మ‌న టీమ్ ఇడ్లీ చేసేసింద‌ని సెహ్వాగ్ చేసిన ఈ ట్వీట్‌పై అభిమానులు ప‌లు ర‌కాలుగా కామెంట్లు చేస్తున్నారు.  



  • Loading...

More Telugu News