: రేపు ‘దర్శకుడు’ టీజర్ ను విడుదల చేయనున్న ఎన్టీఆర్
ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి, ‘సుకుమార్ రైటింగ్స్’ పతాకంపై తన సోదరుడు అశోక్ హీరోగా ప్రస్తుతం ‘దర్శకుడు’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో కొనసాగుతోంది. ఈ సినిమాకి హరిప్రసాద్ జక్కని దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, ఈ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆ సినిమా టీమ్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ విషయాన్ని వెల్లడించింది. తమ సినిమా టీజర్ రేపే విడుదల కాబోతోందని, దాన్ని ఎన్టీఆరే విడుదల చేస్తారని తెలిపింది. ఈ సినిమాకి సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. అశోక్ సరసన ఈషా నటిస్తోంది.
Team #Darshakudu wishes Young Tiger NTR a very Happy Birthday