: తెలంగాణ ఇచ్చిన పార్టీని నరరూప రాక్షస పార్టీ అంటారా?: వి.హనుమంతరావు ఆగ్రహం
తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన పార్టీని నరరూప రాక్షస పార్టీ అంటారా? అని ఆయన విమర్శించారు. అలాగైతే కాంగ్రెస్ పార్టీ నేతలయిన డీఎస్, కేకేలను టీఆర్ఎస్ పార్టీలో ఎందుకు చేర్చుకున్నారని ఆయన అన్నారు. అధికార పార్టీ నేతలు తమ ఇష్టం వచ్చినట్లు తమ పార్టీని తిడితే సహించబోమని అన్నారు. తమ పార్టీని నరరూప రాక్షస పార్టీ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. టీఆర్ఎస్ నేతలు ఓ వైపు రైతులకు బేడీలు వేస్తూనే.. మరోవైపు రైతే రారాజు అంటున్నారని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అని వీహెచ్ అన్నారు.