: మీ రాక కుచేలుడి ఇంటికి కృష్ణుడు వచ్చినంత ఆనందంగా ఉంది: హీరో కృష్ణతో కె.విశ్వనాథ్


ఇటీవ‌లే రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును అందుకున్న దర్శకుడు, క‌ళాత‌ప‌స్వి కె.విశ్వనాథ్‌ను ప్రముఖ నటుడు కృష్ణ ఈ రోజు క‌లిశారు. త‌మ ఇంటికి కృష్ణ రావ‌డం ప‌ట్ల విశ్వ‌నాథ్ హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ... కృష్ణ త‌మ‌ ఇంటికి రావడం కుచేలుడి ఇంటికి కృష్ణుడు వచ్చినంత ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ... తాను థ్రిల్లర్‌, యాక్షన్‌ చిత్రాల్లో న‌టించ‌డానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల విశ్వనాథ్‌తో ఎక్కువ సినిమాలు చేయలేకపోయాన‌ని అన్నారు. సినీ రంగంలోకి ప్ర‌వేశించిన కొత్తలో తనకు నటన వచ్చేది కాదని, అయితే, ఆరు నెలలు పాటు శ్రమించి విశ్వనాథ్‌ తనకు అన్నీ నేర్పించారని తెలిపారు.

  • Loading...

More Telugu News