: పైరసీని అరికట్టడంలో పోలీసులు బాగా పని చేశారు: దర్శకుడు రాజమౌళి
‘బాహుబలి-2’ పైరసీని అరికట్టడంలో పోలీసులు బాగా పని చేశారని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. హైదరాబాద్ లోని సీసీఎస్, సైబర్ క్రైమ్ కార్యాలయ అధికారులను ఈ రోజు ఆయన కలిశారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, పైరసీని అరికట్టిన పోలీసులకు ఈ సందర్భంగా తన కృతఙ్ఞతలు తెలిపారు. ఏ చిత్రమైనా పైరసీ బారిన పడినప్పుడు పోలీసులు చర్యలు తీసుకుంటే, ఆ తర్వాత వచ్చే చిత్రాలకు హెల్ప్ అవుతుందని..ఇలా పోలీసులు చర్యలు తీసుకుంటూ ఉంటే ఆరునెలలకో, సంవత్సరానికో ఒక ఎఫెక్టివ్ ప్లాన్ ని తీసుకురాగలుగుతారని అన్నారు. సినిమా లీక్ అవక ముందే ఆపే ప్రయత్నాలు చేయాలని, తమ సినిమా విషయంలో పోలీసు అధికారులు ఆ విధంగానే చేశారని, పర్సనల్ ఇంట్రస్టు చూపించారని రాజమౌళి ప్రశంసించారు.