: స్వప్రయోజనాల కోసం స్మార్ట్ ఫోన్ల ప్రమోషన్ చేస్తున్న సానియా.. నెటిజన్ల మండిపాటు!
ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఐఫోన్ వినియోగిస్తున్న సానియా తన స్వప్రయోజనాల కోసం స్మార్ట్ ఫోన్లు వాడమంటూ ట్వీట్ చేస్తోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అసలు విషయమేంటంటే, వన్ ప్లస్ టీ స్మార్ట్ ఫోన్ ను నెల రోజుల నుంచి తాను వాడుతున్నాను అనే విషయాన్ని తన ఐఫోన్ ద్వారా ట్వీట్ చేసింది. దీంతో,ట్విట్టర్ యూజర్లు సానియాపై విమర్శలు గుప్పించారు. ఐఫోన్ వాడుతున్న సానియా స్వప్రయోజనాల కోసమే స్మార్ట్ ఫోన్లపై ప్రమోషన్ చేస్తోంది అని విమర్శించారు. కాగా, ఐ ఫోన్ యాప్ నుంచి చేసే ప్రతి ట్వీట్ కు ‘వయా ట్విట్టర్ ఫర్ ఐఫోన్’ అనే ట్యాగ్ వస్తుంది. దీని ఆధారంగానే సానియాపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు.