: సైబర్ క్రైమ్ కార్యాలయ అధికారులను కలిసిన సినీ దర్శకుడు రాజమౌళి


హైదరాబాద్ లోని సీసీఎస్, సైబర్ క్రైమ్ కార్యాలయానికి సినీ దర్శకుడు రాజమౌళి ఈ రోజు వెళ్లారు. ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డతో కలిసి అక్కడికి వెళ్లిన ఆయన, ఇటీవల పట్టుకున్న ‘బాహుబలి-2’ పైరసీ కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏసీపీ రఘువీర్ తో కలిసి మాట్లాడారు. కాగా, ‘బాహుబలి-2’ పైరసీ చేస్తున్న నిందితులను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  

  • Loading...

More Telugu News