: యాదగిరిగుట్టలో భారీ అగ్నిప్రమాదం.. వంద గుడిసెలు దగ్ధం!


తెలంగాణలోని యాదగిరిగుట్టలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు చెప్పిన సమాచారం ప్రకారం, యాదాద్రి అభివృద్ధిలో భాగంగా సాయి పవన్ కన్ స్ట్రక్షన్ సంస్థ యాదగిరి పట్టణ పరిధిలో పనులు చేపడుతోంది. ఈ కంపెనీలో పశ్చిమబెంగాల్, ఒడిశా, బీహార్ కు చెందిన కూలీలు పనిచేస్తున్నారు. పనులు జరిగే సమీపంలో వేసుకున్న గుడిసెల్లో వారు నివసిస్తున్నారు. ఓ గుడిసెలో ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలు పక్క గుడిసెలకు వ్యాపించాయి. దీంతో, అప్రమత్తమైన కూలీలు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ సంఘటనలో వందకు పైగా గుడిసెలు దగ్ధం కాగా, రెండు ఆవులు మృతి చెందాయి. పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

  • Loading...

More Telugu News