: అమెరికాలో మోసం కేసు.. భారతీయ అమెరికన్‌కు 15 ఏళ్ల జైలు


మోసం కేసులో దోషిగా తేలిన భారతీయ అమెరికన్‌కు అమెరికా కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఫ్లోరిడాలోని ఎసెక్స్ హోల్డింగ్ సంస్థలో నవీన్ శంకర్ సుబ్రహ్మణ్యం గ్జేవియర్ (44) సీఈవోగా పనిచేశారు. ఈ సంస్థను అడ్డం పెట్టుకుని ఆయన 100 మంది పెట్టుబడిదారులను మోసం చేసినట్టు విచారణలో వెల్లడైంది. పెట్టుబడిదారుల్లో కొందరి నుంచి 33 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.213 కోట్లు) సేకరించి చిలీలోని ఇనుప గనుల్లో పెట్టుబడిపెట్టినట్టు నమ్మించారు.

తర్వాత ఇంకొందరి నుంచి 1.2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.7.75 కోట్లు) సేకరించి దక్షిణ కరోలినాలోని ఎకనమిక్ డెవలప్‌మెంట్ ఫండ్‌లో పెట్టినట్టు నమ్మించారు.  అనుమానం వచ్చిన కొందరు పెట్టుబడిదారులు నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కొందరి నుంచి తీసుకున్న డబ్బును వారికి ముట్టజెప్పాడు. జనవరిలో ఈ కేసు విచారణను పూర్తిచేసిన మియామీ కోర్టు తాజాగా నవీన్ శంకర్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

  • Loading...

More Telugu News