: ఏపీ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. ఐదు రోజుల పనిదినాల విధానం పొడిగింపు!


ఏపీ సచివాలయ ఉద్యోగులకు శుభవార్త. హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లిన ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాలను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. సచివాలయ సంఘం వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫైల్ పై సీఎం చంద్రబాబునాయుడు సంతకం చేశారు. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. తాజా నిర్ణయంతో, సచివాలయం, రాష్ట్ర స్థాయి కార్యాలయాలు 2018 జూన్ 27 వరకు వారానికి ఐదు రోజులే పని చేస్తాయి. 

  • Loading...

More Telugu News