: పంజాబ్ ముఖ్యమంత్రి కొత్త పార్టీ పెడదామనుకున్నారట!
పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి, కొత్త పార్టీని పెడదామనుకున్నానని చెప్పారు. రెండేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత భేదాభిప్రాయాలు తలెత్తాయని, దీంతో తాను ఈ అభిప్రాయానికి వచ్చానని తెలిపారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలోకి మాత్రం చేరకూడదని నిర్ణయించుకున్నానని చెప్పారు. బీజేపీలో చేరుతున్నట్టు కొన్ని వార్తలు కూడా వచ్చాయని... ఆ వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని తెలిపారు. రెండు సీట్లతో బీజేపీ ప్రభంజనం ప్రారంభమైందని... ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే చతికిల పడేలా చేసిందని చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకుంటుందని అన్నారు. రాజకీయాల్లో ఒడిదొడుకులు సహజమేనని తెలిపారు.