: సీఎం కేసీఆర్‌కు సెల్యూట్ చేసిన పోలీసు జాగిలాలు!


ఈ రోజు హైద‌రాబాద్‌లోని హెచ్ఐసీసీలో పోలీసు అధికారుల‌తో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌ద‌స్సు ఏర్పాటు చేసి, ప‌లు సూచ‌న‌లు చేసిన విష‌యం తెలిసిందే. అంత‌కుముందు అక్క‌డ‌ ఏర్పాటు చేసిన పోలీస్ ఎగ్జిబిషన్ ను కేసీఆర్ ఆసక్తిగా తిల‌కించారు. ఈ సంద‌ర్భంగా ఓ పోలీసు జాగిలం కేసీఆర్‌కి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికింది. అనంత‌రం ఇతర జాగిలాలు కేసీఆర్‌కి సెల్యూట్ చేశాయి. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ విభాగం ఎలా పనిచేస్తాయ‌న్న విష‌యంపై పోలీసులు వివ‌రించారు. బాంబు స్క్వాడ్, ప్రొటెక్షన్ అండ్ డిస్పోజల్ ఎక్విప్మెంట్ వంటి అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో డ్ర‌గ్స్ ను గుర్తించే అధునాతన పరికరాలు, దొంగనోట్లను గుర్తించే పరికరాల గురించి పోలీసులు సంద‌ర్శ‌కుల‌కు వివ‌రించారు. డీజీపీ అనురాగ్ శర్మ, హైద‌రాబాద్ సీపీ మహేందర్ రెడ్డితో క‌లిసి కేసీఆర్ ఈ ఎగ్జిబిష‌న్‌ను తిల‌కించారు.

  • Loading...

More Telugu News