: ‘విశాఖ’లో రెండు రోజుల పాటు జనసేన’ కార్యకర్తల ఎంపిక


ఉత్తరాంధ్రలో జనసేన కార్యకర్తల ఎంపిక కొనసాగుతోంది. ఇవాళ, రేపు విశాఖపట్టణంలో జనసేన కార్యకర్తల ఎంపిక జరుగుతుంది. స్పీకర్, రైటర్, ఎనలిస్ట్ పోస్టులకు సంబంధించి రెండు రోజుల పాటు రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఉత్తరాంధ్ర నుంచి ఇప్పటికే ఆరు వేల దరఖాస్తులు అందాయి. ఇక వచ్చిన దరఖాస్తుల నుంచి అభ్యర్థులను ఎంపిక చేసేందుకు శిబిరం నిర్వహిస్తున్నారు. కాగా, అనంతపురం, గ్రేటర్ హైదరాబాద్ లలో పార్టీ కార్యకర్తలను తయారు చేసే పనిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే తలమునకలై ఉన్నారు.

  • Loading...

More Telugu News