: ఇక అధికారికం... రూ. 1500 కోట్లను దాటేసిన తొలి భారత చిత్రరాజం 'బాహుబలి-2'


సరిగ్గా మూడంటే మూడు వారాల్లో రాజమౌళి దర్శకత్వం వహించిన 'బాహుబలి: ది కన్ క్లూజన్' అనిర్వచనీయమైన రికార్డును అందుకుంది. ఈ సినిమా రూ. 1500 కోట్ల వసూళ్ల మైలురాయిని అందుకుంటుందని గత మూడు రోజులుగా సినీ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తుండగా, అది నేడు నిజమైంది. ప్రపంచ బాక్సాఫీసు చరిత్రలో మరే భారత సినిమాకూ సాధ్యంకాని రికార్డును బాహుబలి అందుకుంది. ఈ సినిమా కలెక్షన్లు రూ. 1500 కోట్లను దాటాయని ఇండస్ట్రీ ట్రాకర్ రమేష్ బాలా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. ఇండియాలో రూ. 1,227 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 275 కోట్లను వసూలు చేసిందని మొత్తం రూ. 1,502 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయని ఆయన వెల్లడించాడు. సినిమా కలెక్షన్లు ఇంకా సంతృప్తికరంగా ఉండటం, మరో పెద్ద చిత్రం ఇప్పట్లో పోటీలో లేకపోవడం, వేసవి సెలవులు కొనసాగుతూ ఉండటంతో ఇక రూ. 2 వేల కోట్ల కలెక్షన్స్ పై బాహుబలి కన్నేసిందని భావించవచ్చు.

  • Loading...

More Telugu News