: లండన్ కు చెక్కేసిన చిదంబరం కుమారుడు కార్తి!
ఎయిర్ సెల్ మాక్సిస్ 2జీ స్కామ్, పీటర్ ముఖర్జియాకు చెందిన ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశీ పెట్టుబడులకు అనుమతులు ఇప్పించి లంచాలు తీసుకున్నారన్న కేసులో ఆరోపణలు ఉన్నాయంటూ, సీబీఐ దాడులు చేసిన మాజీ హోం, ఆర్థికమంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తి చిదంబరం లండన్ పారిపోయారు. ఆయన గురువారం నాడు లండన్ వెళ్లిపోయారని చెన్నై ఎయిర్ పోర్టు అధికారులు ధ్రువీకరించారు. అతని పాస్ పోర్టుపై ఆంక్షలేమీ లేకపోవడంతోనే ఆపలేకపోయామని తెలిపారు.
కార్తీపై తాజాగా ఐఎన్ఎక్స్ మీడియాకు ఎఫ్ఐబీపీ క్లియరెన్స్ ఇప్పించారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విచారణలో భాగంగా మూడు రోజుల క్రితం ఆయన ఇంటిలో సోదాలు కూడా జరిగాయి. అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణ జరుగుతుండగానే ఆయన లండన్ కు వెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కార్తి చిదంబరం వ్యవహారం విజయ్ మాల్యా వ్యవహారాన్ని గుర్తుకు తెస్తోంది. కార్తి ఎందుకు లండన్ వెళ్లారన్న విషయమై ఆయన తండ్రి చిదంబరం ఇంకా స్పందించలేదు.