: సమంతలో నాకు నచ్చనిది అదే!: నాగచైతన్య తొలి ఫన్నీ ఫిర్యాదు


ప్రముఖ సినీ నటుడు నాగచైతన్య తన ప్రియురాలు సమంత గురించి ఒకటీ అరా విశేషాలు చెబుతుంటాడు. ఈ సారి మాత్రం సమంతపై చిలిపి ఫిర్యాదు చేశాడు. 'రారండోయ్...' సినిమా ప్రమోషన్ లో మాట్లాడుతూ, వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పంచుకోవడం తనకు ఇష్టం ఉండదని అన్నాడు. అయితే తాను సమంతను కలిసిన ప్రతిసారీ తనను విపరీతంగా ఫోటోలు తీస్తుందని చెప్పాడు.

'పోనీ ఫోటోలు తీసినది ఊరుకుంటుందా? అంటే ఊరుకోదు... సోషల్ మీడియాలో పెట్టేస్తుంటుంది. దీంతో వాటిని చూసిన వారంతా నన్ను వాటి గురించి అడుగుతుంటారు. స్నేహితులు ఆటపట్టిస్తుంటారు. వారందరికీ నవ్వే సమాధానంగా మౌనం వహిస్తాను' అని చెప్పాడు. తను వాటిని సోషల్ మీడియాలో పెట్టిన తరువాత చూసి, నచ్చకపోయినా కూడా ఊరుకుంటానని అన్నాడు. పెళ్లికి ముందు ఇలా మధురానుభూతులను నిక్షిప్తం చేసుకుంటోందని సరిపెట్టుకుని నవ్వుకుంటానని చెప్పాడు. పెళ్లికి ముందు ఈ సెలబ్రేషన్స్, మూవ్ మెంట్స్, ఎమోషన్స్, అటాచ్ మెంట్ మళ్లీ మళ్లీ వచ్చేవి కాదని, లైఫ్ టైమ్ ఎక్స్ పీరియెన్సెస్ అని నాగచైతన్య తెలిపాడు.

  • Loading...

More Telugu News