: పాముకి ముద్దుపెట్టాలనుకున్నాడు.. నాలుకపై కాటేసింది!
పాముకి ముద్దు పెడతానంటూ అత్యుత్సాహం ప్రదర్శించిన ఓ వ్యక్తి ఆసుపత్రి పాలయిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. న్యూయార్క్‌లోని పుత్నం కౌంటీలో రాన్ రీనాల్డ్ అనే వ్యక్తి పాముని పట్టుకున్నాడు.. దానికి కిస్ ఇస్తాను చూడండంటూ స్నేహితులతో చెబుతూ అన్నంత పనీ చేయబోయాడు. అయితే, అదే సమయంలో ఆ పాము అతడి నాలుకపై కాటు వేసింది. వెంటనే రీనాల్డ్ ని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు. అయితే, ప్రస్తుతం రాన్ రీనాల్డ్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై రాన్ రీనాల్డ్ స్నేహితుడు మాట్లాడుతూ... పామును రీనాల్డ్ చేతిలోకి తీసుకున్నపుడు అది చాలా నిశ్శబ్దంగా ఉందని అన్నాడు. ముద్దు పెట్టుకునే సమయంలో అది ఒక్కసారిగా కరిచిందని చెప్పాడు. ఆ సమయంలో రీనాల్డ్ కొద్దిగా తాగి ఉన్నాడని అన్నాడు.