: పెళ్లి బస్సు బోల్తా.. 25 మందికి తీవ్రగాయాలు.. దగ్గరుండి ఆస్పత్రికి తరలించిన మంత్రి పరిటాల సునీత
అనంతపురం జిల్లాలోని రాప్తాడు మండలం అంబాపురం గుండా వెళుతున్న ఓ పెళ్లి బస్సు ఈ రోజు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడిపోయింది. ఈ ఘటనలో ఆ బస్సులోని 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, అదే సమయంలో ఆ ప్రాంత పరిధిలోనే ఉన్న మంత్రి పరిటాల సునీత వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే ప్రత్యేక వాహనాలను రప్పించి, ఈ ప్రమాదంలో గాయాలపాలయిన వారిని దగ్గరుండి ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు ఆమె సూచించారు.