: నరమాంసం వడ్డిస్తున్నారని ఆరోపణలు... రెస్టారెంట్ మూసివేత
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ ఫేక్ న్యూస్ కారణంగా లండన్ లోని ఓ ఇండియన్ రెస్టారెంట్ తీవ్ర కష్టాలను ఎదుర్కుంటోంది. మనిషి మాంసం వండుతున్నారన్న ఆరోపణలతో 60 ఏళ్ల చరిత్ర ఉన్న సౌత్ లండన్ లోని కర్రీట్విస్ట్ రెస్టారెంట్ మూతపడింది. ఫేక్ న్యూస్ ప్రభావంతో తన రెస్టారెంట్‌లో నరమాంసం వండుతున్నారని ఆరోపిస్తూ, రెస్టారెంటుపై దాడిచేస్తామని తనకు బెదిరింపులు కూడా వచ్చాయని దాని యజమాని రాజ్ రన్ పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన రెస్టారెంటును మూసి వేశానని తెలిపారు. పోలీసుల విచారణలో సోషల్ మీడియాలో వచ్చిన న్యూస్ అంతా ఫేక్ అని తేలింది.