: కన్నడ సినీ అవార్డుల పోటీలో జూనియర్ ఎన్టీఆర్!


జూనియర్ ఎన్టీఆర్ ఏంటి... కన్నడ సినీ అవార్డుకు పోటీ పటీపడటం ఏంటి అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ హీరోగా చక్రవ్యూహ అనే సినిమా కోసం జూనియర్ ఓ పాట పాడాడు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు తమన్ మ్యూజిక్ అందించాడు. ఇందులో జూనియర్ పాడిన పాట సెన్సేషనల్ హిట్ అయింది. అంతేకాదు, కన్నడ ఫిలిం ఫేర్ అవార్డ్స్ రేసులో ఎన్టీఆర్ ను నిలిపింది. ఈ నేపథ్యంలో, ఫిలిం ఫేర్ అవార్డుల్లో జూనియర్ ఎన్టీఆర్ తొలిసారి గాయకుడిగా పోటీపడుతున్నాడు. అవార్డు రావచ్చు లేదా రాకపోవచ్చు. కానీ, పరాయి భాషలో అవార్డు కోసం ఎన్టీఆర్ పోటీ పడుతుండటమే ఓ అరుదైన ఘనత. 

  • Loading...

More Telugu News