: వీవీఎస్ లక్ష్మణ్ ను ఆటపట్టించిన సెహ్వాగ్


టీమిండియా దిగ్గజ మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ను డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆటపట్టించాడు. ట్విట్టర్ మాధ్యమంలో లక్ష్మణ్ కు చెందిన పాత ఫోటోలు పోస్టు చేసిన సెహ్వాగ్...నిన్న జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికర ప్రశ్నను సంధించాడు. ఐపీఎల్ లో ఎలిమినేటర్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రెడర్స్ తో మ్యాచ్ కు ముందు చేసిన ఈ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది.
 
గత నెలలో లక్ష్మణ్ తిరుమల తిరుపతిలో శ్రీవారిని దర్శించుకున్నప్పటి ఫోటోలను పోస్టు చేసిన సెహ్వాగ్... 'ఏంటి లక్ష్మణ్! వర్షం భారీగా కురిసి, మ్యాచ్ రద్దవ్వాలని ప్రత్యేక పూజలు చేస్తున్నావా?' అంటూ ప్రశ్నించాడు. అయితే కాకతాళీయంగా నిన్న వర్షం పడడం, మ్యాచ్ ఆగడం జరిగింది. అయితే మ్యాచ్ రద్దవ్వలేదు. వాన వెలిసిపోవడంతో ఆట సాధ్యమని ప్రకటించిన అంపైర్లు, 6 ఓవర్లలో 48 పరుగులు చేయాలని నిర్దేశించడంతో కోల్ కతా ధాటిగా ఆడి స్వల్ప లక్ష్యాన్ని సులభంగానే ఛేదించింది. 

  • Loading...

More Telugu News