: యుద్ధం వచ్చే సూచనలు చాలానే కనిపిస్తున్నాయి!: దక్షిణ కొరియా అధ్యక్షుడి సంచలన వ్యాఖ్య


ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అణు యుద్ధానికి తాను సిద్ధమన్న సంకేతాలను పంపుతున్న వేళ, దక్షిణ కొరియాకు నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు మూన్ జేయిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధం వచ్చే సూచనలు చాలానే కనిపిస్తున్నాయని ఆయన హెచ్చరించారు. ఇటీవలి ఉత్తర కొరియా బాలిస్టిక్ మిసైల్ ప్రయోగం, అది అణు వార్ హెడ్ లను మోసుకెళ్లగలిగే సామర్థ్యాన్ని కలిగివుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన మూన్, కిమ్ సైన్యం అణ్వస్త్ర సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెళుతోందని, ఏం జరిగినా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండాలని అన్నారు. 

  • Loading...

More Telugu News