: ట్రంప్ పరిస్థితిని చూసి పగలబడి నవ్విన పుతిన్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నలు వైపుల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఎఫ్ బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కొమే రాసినట్టు పేర్కొన్న మెమో, ఐసిస్ కీలక సమాచారాన్ని కోడ్ భాషలో రష్యా విదేశాంగ మంత్రి షెర్గీ లెవరోవ్ తో పంచుకున్నట్టు వచ్చిన వార్తలతో ట్రంప్ కు మరిన్ని చిక్కులు వచ్చాయి. ట్రంప్ పరిస్థితిని చూసి రష్యా అధ్యక్షుడు పుతిన్ నవ్వుకున్నారు. ఇటలీ ప్రధానితో కలసి ప్రెస్ మీట్ లో పాల్గొన్న పుతిన్... ట్రంప్ పై వస్తున్న ఆరోపణలపై అడిగిన ప్రశ్నకు బదులుగా పగలబడి నవ్వారు.
తనతో కాని, రష్యా సీక్రెట్ సర్వీసెస్ తో కాని జేమ్స్ కొమే ఎలాంటి సమాచారాన్ని పంచుకోలేదని... ఇది ట్రంప్ కు సంబంధం లేని విషయమని పుతిన్ అన్నారు. రష్యా వ్యతిరేక విధానాల వల్ల అమెరికాలో అస్థిరత్వం నెలకొందని చెప్పారు. ఆ దేశంలో రాజకీయ మనో వైకల్యం నెలకొందని అన్నారు. రష్యా వ్యతిరేక విధానాలతో రాజకీయాలను నడిపించడం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని చెప్పారు. అయితే, ఇది పూర్తిగా అమెరికాకు చెందిన విషయమని... ఆ విషయంలో తాము జోక్యం చేసుకోబోమని అన్నారు.