: బాలీవుడ్ 'అమ్మ' రీమా లాగూ ఇకలేరు!


ప్రముఖ బాలీవుడ్ నటి, తల్లిపాత్రలకు పెట్టింది పేరైన రీమా లాగూ ఈ ఉదయం ముంబైలో గుండెపోటుతో మరణించారు. ఆమె వయసు 59 సంవత్సరాలు. హిందీ, మరాఠీ భాషల్లో పలు చిత్రాలతో పాటు ఎన్నో టీవీ సీరియళ్లలో ఆమె నటించి మెప్పించారు. ఆక్రోశ్, ఆషిఖీ, హమ్ ఆప్ కే హై కౌన్, దిల్ తేరా దివానా, మైనే ప్యార్ కియా, కుచ్ కుచ్ హోతాహై వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఆమె తల్లి పాత్రలను పోషించారు. రీమా మృతిపై బాలీవుడ్ చిత్ర ప్రముఖులు పలువురు నివాళులు అర్పించారు.

  • Loading...

More Telugu News