: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కారును అడ్డుకున్న మహిళలు


నాలుగు నెలల క్రితం తమను సర్కారు అకారణంగా ఉద్యోగాల నుంచి తొలగించిందని ఆవేదన వ్యక్తం చేస్తూ కొందరు మ‌హిళ‌లు ఈ రోజు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కారుని అడ్డుకొని నిర‌స‌న తెలిపారు. వారంతా ప్రభుత్వ ఆసుపత్రి మాజీ ఉద్యోగులని తెలుస్తోంది. ఈ నిర‌స‌న‌ ప్రదర్శన కోసం పెద్ద సంఖ్యలో మ‌హిళ‌లు తరలిరావ‌డంతో అల‌జ‌డి రేగింది. ఉద్యోగాలు లేకుండా తాము ఎలా బతకాలని సద్రు మహిళలు ప్ర‌శ్నించారు. వెంట‌నే స్పందించిన పోలీసులు ఆ మ‌హిళ‌ల‌ను బలవంతంగా పక్కకు లాగారు. అనంత‌రం సీఎం కారు ముందుకు వెళ్లింది.

  • Loading...

More Telugu News