: 101వ సినిమా షూటింగ్ లో భాగంగా... కెమెరాపై గాగుల్స్ విసిరిన బాలయ్య.. మీరూ చూడండి!


పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ, శ్రేయ శ‌ర‌న్‌, ముస్కాన్‌లు ప్రధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతుండ‌గా తీసిన ఓ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ సినిమాలోని ఓ సీన్ లో భాగంగా తన గాగుల్స్ ని బాల‌య్య‌ కెమెరా వైపు విసిరేస్తాడు. ఈ వీడియోను చూస్తోన్న బాల‌య్య అభిమానులు 'వావ్' అంటున్నారు. బాల‌కృష్ణ 101వ సినిమా అయిన ఈ మూవీని ఈ ఏడాది సెప్టెంబర్ 29న విడుద‌ల చేయ‌నున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని బాలయ్య బర్త్ డే (జూన్ 10) రోజున‌ విడుదల చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. బాల‌య్య అభిమానుల‌ను అల‌రిస్తోన్న వీడియోను మీరూ చూడండి..

  • Loading...

More Telugu News