: అన్నీ తప్పుడు వార్తలే... ఇంతకన్నా చెప్పేదేమీ లేదు: ఐబీఎం స్పష్టీకరణ


ఐబీఎం సంస్థ నుంచి 5 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపించి వేయనుందని వచ్చిన వార్తలపై సంస్థ స్పందించింది. ఈ మధ్యాహ్నం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసిన ఐబీఎం ఉద్యోగుల తొలగింపు వార్తలు నిరాధారమని పేర్కొంది. ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైన ఈ విషయంలో ఓ అధికారి స్పష్టత ఇస్తూ, ఇటువంటి ఊహాగానాలు, రూమర్లపై ఇంతకన్నా మరింతగా చెప్పేదేమీ లేదని పేర్కొన్నారు.

 అమెరికా వీసా విధానం, ఆటోమేషన్ తదితర కారణాలతో ఐబీఎం ఉద్యోగులపై వేటు పడనుందని, ఇప్పటికే తొలగింపు ప్రారంభమైందని సంస్థలోనే పని చేస్తున్న ఓ ఉన్నతోద్యోగి వెల్లడించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ప్రస్తుతం ఇండియాలోని ఐబీఎం కార్యాలయాల్లో 1.50 లక్షల మంది పని చేస్తున్నారు. క్లౌడ్ టెక్నాలజీ లాభాలను మరింతగా అందుకునే దిశగా ఉద్యోగుల్లో నైపుణ్యతను పెంచేందుకు మరిన్ని కార్యక్రమాలను చేపట్టనున్నట్టు సంస్థ ఇటీవల ప్రకటించింది.

  • Loading...

More Telugu News