: సన్ రైజర్స్ కు మరింత కష్టం... నెహ్రా అవుట్, ఫిట్ నెస్ లేమిలో యువరాజ్!


నేడు అత్యంత కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ లో బలమైన కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ పై ఆడాల్సిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరిన్ని కష్టాలు ఎదురయ్యాయి. తనకు తగిలిన గాయం కారణంగా లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా జట్టుకు దూరమయ్యాడు. ఈ సీిజన్ లో 6 మ్యాచ్ లు మాత్రమే ఆడిన నెహ్రా ప్లే ఆఫ్ కు అందుబాటులో ఉండబోడని ఆ జట్టు మేనేజ్ మెంట్ ప్రకటించింది. ఇక 11 మ్యాచ్ లాడి 243 పరుగులు సాధించి, జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న యువరాజ్ సింగ్ ఫిట్ నెస్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. యువరాజ్ ఫిట్ నెస్ పై అనుమానాలు వ్యక్తం చేసిన జట్టు కోచ్ టామ్ మూడీ, నేడు యువరాజ్ కు ఫిట్ నెట్ టెస్టు నిర్వహిస్తామని, దానిలో సంతృప్తి చెందితేనే ఎలిమినేటర్ మ్యాచ్ లో తీసుకుంటామని స్పష్టం చేశాడు. ఇక కీలక ఆటగాళ్లు దూరమైన స్థితిలో సన్ రైజర్స్ ఆటతీరు ఏ మేరకు ప్రభావితం చెందుతుందో నేటి రాత్రి తేలనుంది.

  • Loading...

More Telugu News