: న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ కు మద్దతుగా నిలిచిన అమూల్


త్వరలో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత డెయిరీ రంగ దిగ్గజం అమూల్, న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ కు స్పాన్సరర్ గా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా న్యూజిలాండ్ జెర్సీలపై అమూల్ లోగో కనపడనుండగా, భారత జట్టుతో న్యూజిలాండ్ 28న వార్మప్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, ఫార్ములా వన్, లండన్ 2012 ఒలింపిక్ గేమ్స్, రియో 2016 ఒలింపిక్స్ తదితర క్రీడా పోటీలకు స్పాన్సరర్ గా నిలిచిన అమూల్, ఈ సంవత్సరం కివీస్ జట్టుకు ప్రైమ్ స్పాన్సరర్ గా నిలిచింది.

భారత జట్టుకు మద్దతిచ్చే అవకాశాన్ని కోల్పోయిన అమూల్, చాంపియన్స్ ట్రోఫీకి ఉన్న క్రీడాభిమానుల ఆదరణ నేపథ్యంలో కివీస్ తో జట్టు కట్టింది. కాగా, ఆసియాలో అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థగా ఉన్న అమూల్ బ్రాండ్ వార్షిక టర్నోవర్ రూ. 27 వేల కోట్లకు పైగానే ఉన్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ ఆటగాళ్ల జర్సీలు, ట్రైనింగ్ కిట్స్, టోపీలు తదితరాలపై అమూల్ లోగో దర్శనమివ్వనుంది. తొలిసారిగా న్యూజిలాండ్ స్పాన్సరర్ గా డీల్ కుదరడం తమకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఎండీ ఆర్ఎస్ సోధీ వ్యాక్యానించారు.

  • Loading...

More Telugu News