: ట్విట్టర్ ఎంపిక చేసిన ఐపీఎల్ బెస్ట్ క్రికెట్ టీమ్ ఇదే


ఐపీఎల్ ఆట చివరి అంకానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో దేశవిదేశీ ఆటగాళ్లు సుమారు 50 రోజులపాటు భారత క్రికెట్ అభిమానులకు పసందైన క్రీడా విందును అందించారు. ఈ నేపథ్యంలో అభిమాన ఆటగాళ్లతో ఒక జట్టు రూపొందించాలని, ట్విట్టర్ ఆన్ లైన్ సర్వే ఒకటి చేపట్టింది. ఓట్ల ఆధారంగా జట్టును సమకూరుస్తామని తెలిపింది. తాజాగా ట్విట్టర్ అభిమానుల ఐపీఎల్ కలల జట్టును ప్రకటించింది.

ఈ జట్టులో కేవలం ఒకేఒక్క విదేశీ ఆటగాడు స్థానం సంపాదించడం విశేషం. అసాధారణ ప్రతిభతో ఆకట్టుకుంటున్న బెన్ స్టోక్స్ పై అభిమానులు విశేషమైన ఆదరణ చూపించారు. ఈ జట్టు జాబితా ఓట్ల ప్రాధాన్యతా క్రమంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా,  గౌతమ్ గంభీర్, రోహిత్ శర్మ, అజింక్యా రహానే, సురేష్ రైనా, యువ రాజ్ సింగ్, బెన్ స్టోక్స్, మహేంద్ర సింగ్ ధోనీ, హర్భజన్ సింగ్, ఉమేష్ యాదవ్, జహీర్ ఖాన్ లు స్థానం సంపాదించుకున్నారు. ఇందులో టీమిండియాలో కోహ్లీ, రోహిత్, రహానే, యువీ, ధోనీ, ఉమేష్ లు స్థానం సంపాదించగా, జహీర్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. రైనా, గంభీర్, హర్భజన్ లు జట్టులో స్ధానం సంపాదించలేదు. 

  • Loading...

More Telugu News