: జియో ప్రభావం: వోడాఫోన్ లాభాలు తగ్గిపోయాయ్!
ఉచిత మంత్రంతో టెలికం మార్కెట్లోకి వచ్చి రిలయన్స్ జియో సృష్టించిన ప్రభంజనంతో మిగతా కంపెనీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. జియో రాక ముందు లాభాల్లో కొనసాగిన పలు సంస్థలు జియో వచ్చిన తరువాత కుదేలయిపోయాయి. ప్రముఖ టెలికాం రంగ సంస్థ వోడాఫోన్ కూడా భారీగా లాభాలను కోల్పోయింది. 10.2 శాతం క్షీణతతో రూ. 11,784 కోట్ల ఆపరేటింగ్ లాభాలను మాత్రమే సాధించింది. మొత్తం ఆదాయం 0.6 శాతం క్షీణించి 43,095 కోట్లకు పడిపోయినట్లు తెలిపింది. స్టాండ్ ఎలోన్ ప్రాతిపదికన ఎబిటా లాభం రూ.13,115 కోట్లుగా నమోదయింది.