: బోధన్ నకిలీ చలాన్ల వ్యవహారంపై సీఎం కేసీఆర్ సీరియస్!
బోధన్ నకిలీ చలాన్ల వ్యవహారంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా వాణిజ్య పన్నుల శాఖ సమీక్ష సమావేశాన్ని హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో ఈ రోజు నిర్వహించారు. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, అవినీతిని అరికట్టే విషయంలో రాజీ పడకూడదని, వాణిజ్య పన్నుల శాఖ పటిష్టంగా పనిచేయాలని సూచించారు.