: పాలస్తీనాకు మద్దతు విషయంలో దృఢంగా ఉన్నాం: ప్రధాని మోదీ
పాలస్తీనాకు మద్దతు విషయంలో దృఢంగా ఉన్నామని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వీసా మినహాయింపులు, ఆరోగ్యం, క్రీడలు సహా రెండు దేశాల మధ్య ఐదు ఒప్పందాలపై భారత్, పాలస్తీనా దేశాలు సంతకాలు చేశాయి. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మన ప్రధాని మోదీ, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ పాల్గొన్నారు. అనంతరం మోదీ మాట్లాడుతూ, శాంతి కోసం పాలస్తీనా అనుసరిస్తున్న విధానానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని, పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశాల మధ్య చర్చల ప్రక్రియ కొనసాగాలని ఆశిస్తున్నానని అన్నారు.