: 20న దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ కు సన్మానం


ఈ నెల 20న దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కె.విశ్వనాథ్ కు సన్మానం జరగనుంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సన్మాన కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. ‘కళా కార్మికుడికి చిత్రసీమ ప్రణామమ్’ పేరిట విశ్వనాథ్ ను సన్మానించనున్నారు. కాగా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును దర్శకుడు విశ్వనాథ్ ఇటీవలే అందుకున్నారు. విశ్వనాథ్ తెరకెక్కించిన పలు చిత్రాలు సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వాతికిరణం, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు వంటి ఎన్నో చిత్రాలు విశ్వనాథ్ దర్శక ప్రతిభకు తార్కాణాలు.

  • Loading...

More Telugu News