: నగదు విత్ డ్రా నిబంధనలపై స్పష్టత ఇచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా


ఏటీఎంల నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులు డబ్బులను విత్ డ్రా చేసుకుంటే అధికంగా చార్జీలను చెల్లించాల్సి వుంటుందని హల్ చల్ చేస్తూ, ప్రజల్లో ఆందోళన పెంచిన వార్తలపై బ్యాంకు ఎండీ రజనీష్ కుమార్ స్పందించారు. ఓ అధికారిక ప్రకటన చేసిన ఆయన, ప్రస్తుతమున్న చార్జీలే కొనసాగుతాయని, కొత్తగా ఎటువంటి చార్జీల భారమూ కస్టమర్లపై పడబోదని స్పష్టం చేశారు. కేవలం ఎస్బీఐ బడ్డీ యాప్ ద్వారా డబ్బు తీసుకున్న వారిపై మాత్రమే కొత్తగా ఒక్కో లావాదేవీపై రూ. 25 వసూలు చేయాలని నిర్ణయించామని, మిగతా నిబంధనలన్నీ పాతవేనని తెలిపారు. ఈ చార్జీలు వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తాయని, ఏటీఎంల వినియోగదారుల్లో అపోహలు వద్దని, ఉచిత లావాదేవీలను పరిమితి మేరకు వాడుకోవచ్చని వెల్లడించారు.

  • Loading...

More Telugu News