: టీమిండియా-పాక్ ద్వైపాక్షిక సిరీస్ కు మేము ఆతిథ్యమిస్తాం... అనుమతివ్వండి!: మోదీని కోరిన శ్రీలంక బోర్డు అధ్యక్షుడు


టీమిండియాతో పాకిస్థాన్ క్రికెట్ ఆడేందుకు అనుమతినిస్తే ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీలంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తిలంగ సుమతిపాల తెలిపారు. బండారునాయకే మెమోరియల్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ లో భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఏర్పాటు చేసిన సమావేశంలో టీమిండియాకు పాకిస్థాన్‌ తో క్రికెట్‌ ఆడేందుకు అనుమతినివ్వాలని కోరినట్లు తెలిపారు. దీనివల్ల ద్వైపాక్షిక సంబంధాలు బలపడడంతో పాటు, ఇరుజట్ల క్రికెట్ బోర్డులు ఆర్ధికంగా లాభపడతాయని ఆయన తెలిపారు. దుబాయ్, లేదా శ్రీలంకల్లో పాక్‌ తో సిరీస్ ఆడేందుకు టీమిండియాకు అనుమతినివ్వాలని ఆయన సూచించారు. 

  • Loading...

More Telugu News