: కోదండరాంకు జనసేనోడు ఒచ్చి చేరిండు.. వీడు యాడికెళ్లి ఒచ్చిండో తెల్వదు: నాయిని వ్యాఖ్యలు


ఇందిరాపార్క్ వద్ద సోమవారం జరిగిన నిరసన ప్రదర్శనలు రణరంగాన్ని తలపించడంపై తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్టులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాంపైనా నిప్పులు చెరిగిన ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పైనా పరోక్షంగా విమర్శలు చేశారు. ప్రతిపక్షాల అండ చూసుకుని కోదండరాం చెలరేగిపోతున్నారని అన్నారు.

‘‘కోదండరాంకు తోడుగా జనసేనోడు ఒచ్చి చేరిండు. వీడు యాడికెళ్లి ఒచ్చిండో తెల్వదు’’ అని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ధర్నాచౌక్ ముట్టడికి ప్రజల మద్దతు లేదని అన్నారు. విపక్షాలకు చెందిన వారు స్థానికులను కొడుతుంటే పోలీసులు సముదాయించారు తప్ప వారు ఎవరిపైనా చేయి చేసుకోలేదని పేర్కొన్నారు. ఇందిరాపార్క్ వద్ద ధర్నాలకు ప్రభుత్వం అనుమతి ఇస్తే రోజూ కొట్టుకుంటారని నర్సింహారెడ్డి అన్నారు.

  • Loading...

More Telugu News