: బాహుబలి-2 తర్వాత రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన బాలీవుడ్ సినిమా
ఈ నెల 5న చైనాలో ఆమిర్ ఖాన్ ‘దంగల్’ సినిమా విడుదలై, అక్కడి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆ సినిమాకి కలెక్షన్లు మెరుగుపడి రూ.1000 కోట్ల క్లబ్ లో చేరింది. ‘బాహుబలి 2’ తర్వాత మరో రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన మరో భారతీయ సినిమా దంగల్ నిలిచి, రికార్డు సృష్టించింది. కేవలం పది రోజుల్లోనే చైనాలో 382.69 కోట్లను దంగల్ రాబట్టింది. దీంతో ఆ దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా దంగల్ నిలిచింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 2’ సినిమా విడుదల కాకముందు దంగల్ సినిమాయే అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా ఉంది. అనంతరం రెండవ స్థానానికి పడిపోయింది.