: టొమాటో వల్ల ఎన్ని ఉపయోగాలో..!: శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
ప్రతిరోజు మనం వంటల్లో ఉపయోగించే టొమాటోతో మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని తాజాగా ఇటలీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మనిషిని భయపెట్టే కేన్సర్ రోగం విస్తరించకుండా కూడా అడ్డుకునే శక్తి ఈ కూరగాయ సొంతమని తెలిపారు. కేన్సర్ కణాల పెరుగుదలను అది నిరోధిస్తుందని, వ్యాధి ముదరకుండా కూడా చేస్తుందని చెప్పారు. సాన్‌మార్బానో, కార్బారినో రకాలకు చెందిన టొమాటోల్లో ఈ శక్తి ఉందని చెప్పారు. టొమాటాల్లో ఉండే ఒకరకమైన సారం గ్యాస్ట్రిక్ కేన్సర్ కణాల ఎదుగుదలను నిరోధిస్తుందని చెప్పారు. తాము కనుగొన్న ఈ అంశాలు మున్ముందు ఎంతో ఉపయోగపడనున్నాయని వివరించారు.