: ఉత్తర కొరియాను బెదిరిస్తున్న అమెరికాను హెచ్చరించిన రష్యా అధ్యక్షుడు
ఉత్తర కొరియా 4,500 కిలోమీటర్ల దూరం వెళ్లగల హాసంగ్-12 మిస్సైల్‌ను ప్రయోగించి మరో దుందుడుకు చర్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆ మిస్సైల్ ప్రయోగం పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న ఆయన... ఆ క్షిపణి ప్రయోగం ప్రమాదకరమని పేర్కొన్నారు. కొరియా ద్వీపకల్పంలో ఉన్న ఉద్రిక్తతను తగ్గించేందుకు శాంతియుత పరిష్కారాన్ని వెతకాలని, అణ్వాయుధాల సంఖ్యను పెంచుకునే దేశాల తీరును తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అలాగే, ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న ఉత్తర కొరియాను బెదిరిస్తున్న అమెరికాను కూడా పుతిన్ హెచ్చరిస్తూ అలాంటి బెదిరింపులను తాము కూడా సహించబోమని వ్యాఖ్యానించారు.