: రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఎంపీ పదవులకు రాజీనామా చేయనున్న యోగి, పారికర్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గోవా సీఎం మనోహర్ పారికర్ లు ఇంకా ఎంపీలుగా కొనసాగుతూనే ఉన్నారు. త్వరలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి ఎన్నికలు ఉండటంతో... వీరు ఎంపీ పదవులకు ఇంకా రాజీనామా చేయలేదు. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ తర్వాత ఎంపీ సభ్యత్వానికి వీరు రాజీనామా చేయనున్నారు. యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా వీరితో పాటు ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తారు. యోగి, మౌర్యలు లోక్ సభ ఎంపీలు కాగా... పారికర్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. మార్చి 14న పారికర్, మార్చి 19న యోగి, మౌర్యలు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులగా ప్రమాణస్వీకారం చేశారు. ఆరు నెలల్లోగా వీరు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కావాల్సి ఉంది.